రైతు రుణమాఫీ పై పాలకవర్గం హర్షం.
చిలుకూరు,ఆగష్టు 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడంపై చిలుకూరు పీఏసీఎస్ పాలకవర్గం హర్షం వ్యక్తం చేశారు.శుక్రవారం పాలకవర్గ సమావేశంలో చైర్మన్ అలస కానీ జనార్ధన్ మాట్లాడుతూ చిలుకూరు సొసైటీలో మొదటి విడత 1069 మంది రైతులకు మూడు కోట్ల 57 లక్షల 40 వేల రూపాయలు రెండో విడత307 మంది రైతులకు ఒక కోటి 85 లక్షల 37 వేల రూపాయలు విడుదల ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.వాటిని రైతులకు వెంటనే అందజేస్తున్నామని ఆయన అన్నారు. వీటితోపాటు పట్టాదారు పాసు పుస్తకాలు ఉండి ఇంతవరకు రుణం తీసుకొని వారికి కూడా కొత్త రుణాలు అందజేస్తున్నామని తెలిపారు.సొసైటీ పరిధిలో నాలుగు గోడౌన్ లో ఖరీఫ్ సీజన్ కు అవసరమైన ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, పౌరసరఫరాల,నీటిపారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి,కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో సీఈవో లక్ష్మీనారాయణ,డైరెక్టర్లు కస్తూరి సైదులు,కొండ సోమయ్య,బెల్లంకొండ సైదులు,కోడారు రాంబాబు,శ్రీహరి,రాములు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.