రోగాలపై దండయాత్ర చేసి ఆరోగ్యాన్నిచ్చే దొండకాయలు
హెల్త్ టిప్స్,జులై 05 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మనం తినే ప్రతి కూరగాయలోనూ మన శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. ఒక్కొక్క కూరగాయ ఒక్కొక్క రకమైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అయితే అటువంటి కూరగాయలలో దొండకాయ ఒకటి. దొండకాయ మనకు ఆరోగ్యాన్ని కలిగించే అనేక పోషకాలతో నిండి ఉంటుంది. చాలా మంది దొండకాయ తింటే మంద బుద్ధి వస్తుందని, మెదడు బాగా పని చెయ్యదని చెప్తారు.
*దొండకాయలతో ఆరోగ్యం* దొండకాయలతో ఎన్ని రోగాల మీద దండయాత్ర చెయ్యొచ్చో, ఎంత ఆరోగ్యం వస్తుందో తెలిస్తే తినకుండా ఉండరు. దొండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది మలబద్ధకం వంటి సమస్యలను దొండకాయ దూరం చేస్తుంది. విటమిన్ బి వన్, విటమిన్ బి టు, బి త్రీ, బి సిక్స్, బి 9, విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, సోడియం వంటి అనేక పోషకాలు దొండకాయలో ఉంటాయి.
*దొండకాయలతో షుగర్ కంట్రోల్* దొండకాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దొండకాయలోని యాంటీ ఆడిపోజనిక్ ఏజెంట్ రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతుంది. అంతేకాదు దొండకాయలలో థయమిన్ ఉంటుంది. దొండకాయలను తినడం వల్ల రక్తహీనత సమస్య క్రమంగా తగ్గుతుంది. ఇక పచ్చి దొండకాయ మీ రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది.
*దొండ కాయలతో అనేక వ్యాధుల నుండి రక్షణ* దొండకాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.దొండకాయలు తినడం వల్ల అనేక రకాల వ్యాధుల నుంచి మనం దూరంగా ఉండవచ్చు. దొండకాయ నోటి పూత సమస్యలను తగ్గిస్తుంది . అనేక రకాల వైరల్ ఇన్ఫెక్షన్లను దొండకాయ నిరోధిస్తుంది. దొండకాయలో గుండెను ఆరోగ్యంగా ఉంచే వివిధ రకాల పోషకాలు ఉంటాయి.
*గుండె పోటు, పక్షవాతం సమస్యలను దూరం* చేసే దొండకాయలు యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ ఫ్రీ రాడికల్స్ తో దొండకాయ మన శరీరంలో రోగాలతో పోరాడడానికి సహాయపడుతుంది దొండకాయలు ఎక్కువగా తిన్న వారికి గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. దొండకాయలు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ఆస్తమాను నివారిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి.