రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…
– టైర్ పగిలి చెట్టుకు గుద్దిన కారు…
– అక్కడికక్కడే మృతి చెందిన బాలుడు.
– ఆస్పత్రిలో మరణించిన తండ్రి.
– భార్య,కూతురు పరిస్థితి విషమం.
Mbmtelugunews//నిర్మల్ జిల్లా, అక్టోబర్ 09:ప్రయాణంలో కారు టైరు పగిలి,చెట్టుకు గుద్ది ప్రమాదం సంభవించి ఇద్దరు మరణించిన ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మథ్ గ్రామానికి చెందిన సంఘం సురేష్ మంగళవారం తన కుటుంబ సభ్యులైన భార్య కూతురు కుమారుడితో అత్తగారి వురైనా బోథ్ మండలం కుచ్లాపూర్ గ్రామానికి వెళ్ళి నేడు బుధవారం తిరిగి వస్తున్న క్రమంలో నర్సాపూర్ మండలం నందన్ తూరాటి గ్రామం మధ్యలో కారు టైరు పగిలి చెట్టుకు గుద్దుకోవడంతో కుమారుడైన సంఘం సాయి దీక్షిత్ (7) అక్కడికక్కడే మృతి చెందడని,బాలుడిని బైంసా ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా,సంగం సురేష్ (27),భార్య ప్రియాంక(25), కూతురు తన్సిక (5)ని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించమని పేర్కొన్నారు.అయితే ఆస్పత్రిలోనే సురేష్ మరణించారని స్థానికులు పేర్కొన్నారు.భార్య, కూతురు పరిస్థితి ప్రస్తుతం విషమంగా వుంది.



