Friday, March 20, 2026
[t4b-ticker]

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Mbmtelugunews//కోదాడ, మార్చి 20: మున్సిపల్ పరిధిలోని తమ్మరబండ్లపాలెం గ్రామానికి చెందిన యువకుడు షేక్ రహీం రోడ్డు ప్రమాదంలో మృతి నేను సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రంజాన్ పండుగ సందర్భంగా తన గాజుల వ్యాపారం నిమిత్తం ఖరీదుకై బుధవారం అందాజు మధ్యాహ్నం సమయంలో ఖమ్మం వెళుతుండగా ముదిగొండ సమీపంలో బైక్ ఢీకొట్టగా తీవ్ర గాయాలు అయ్యి స్పృహ కోల్పోయినాడు. ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు అంబులెన్స్ కి ఫోన్ చేయగా ఖమ్మం ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ తీసుకువెళ్లాలని తెలుపగా హైదరాబాదులో వైద్యం తీసుకుంటూ శుక్రవారం మృతి చెందారు. ఈ సందర్భంగా తన సొంత గ్రామములో విషాదఛాయలు అలుముకున్నాయి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా దుఃఖసాగరములు ఉన్నారు. మృతునికి కూతురు, కుమారుడు భార్య ఉన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular