లక్ష్మీపురం ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలి
:18 సంవత్సరాల నుండి ఎలాంటి ఆధారాలు లేకుండా నివాసం ఉంటున్నాం
:ఇంటి పన్ను,నల్లా పన్ను కడదామని మున్సిపాలిటీకి వెళ్తే మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు
:గత ఎన్నికలలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గెలిచిన వెంటనే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
:అన్ని రకాల సమస్యలతో సతమతమవుతున్న కాలనీవాసులు
Mbmtelugunews//కోదాడ, జులై 13(ప్రతినిది మాతంగి సురేష్): పట్టణ పరిధిలోని లక్ష్మీపురం ఇందిరమ్మ కాలనీ 2007 జనవరి 6న భూమి పూజ చేసినారు. ఈ కాలనీకి మొత్తం 1431 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. అప్పటినుండి ఇప్పటివరకు 900 ఇల్లులు పూర్తి అయినవి మిగతా ఇల్లులు దశల వారీగా ఉన్నవి. ఈ 1431 ఇండ్లకు సంబంధించి ఒక 20% మందికి మాత్రమే ఇంటి పన్ను చెల్లిస్తున్నారు మిగతా 80 శాతం మంది ఇంటి పన్ను చెల్లించడం లేదు స్థానిక మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఇంటి పన్ను కడతామంటే మీకు పట్టాలు మంజూరు కాలేదు కావున మీ ఇంటి పన్ను కట్టించుకోమని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ ఇంటి పనులకు సంబంధించి ఆదివారం సామాజిక ఉద్యమకారులు సయ్యద్ బషీరుద్దీన్ కాలనీవాసులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ గత 18 ఏళ్లగా ఈ ఇండ్లలో మేము నివాసం ఉంటున్న ఇంతవరకు మాకు పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోయిన ప్రభుత్వంలో పట్టాలిస్తామని హామీ ఇచ్చి గెలిచిన నాయకులు గెలిచిన తర్వాత మమ్మల్ని మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఎన్నికల సమయంలో నేను గెలిస్తే మీ అందరి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని గెలిచినాక ఇంతవరకు మా సమస్య పరిష్కారం కాలేదని వారు తెలిపారు. కాలనీలో పట్టాల సమస్య కాకుండా డ్రైనేజ్, వాటర్, రోడ్స్ అనేక సమస్యలతో కాలనీవాసులు సతమతమవుతున్నామని అన్నారు. వర్షాకాలం సమయంలో డ్రైనేజ్ సరిగా లేక దోమలతో నానా ఇబ్బందులు పడి కూలి పని చేసుకోని సంపాదించిన డబ్బులు హాస్పిటల్ పాలు అవుతున్నాయని అన్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి మాకు పట్టాలి ఇప్పించి మాకు న్యాయం చేయాలని పలువురు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి భాస్కరరావు, తుమ్మ నాగేశ్వరరావు, మామిడి శంకర్, జి శ్రీనివాస్, సరోజనమ్మ, అన్నపూర్ణ, షేక్ ఈ సుబ్బు, లక్ష్మి, పద్మ, గులాం ముస్తఫా, సిద్దయ్య, రాజు, రత్నం తదితరులు పాల్గొన్నారు.