లక్ష డప్పులు -వేయి గొంతులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి:బొల్లికొండ కోటయ్య
Mbmtelugunews//కోదాడ,జనవరి 19(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ డివిజన్(ఎంఈఎఫ్) ఆధ్వర్యంలో* ఆదివారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాదిగ ఉద్యోగ సమాఖ్య( ఎంఈఎఫ్),జిల్లా గౌరవ సలహాదారులు బొల్లికొండ కోటయ్య పాల్గొని ప్రసంగించారు.గత ముప్పై సంవత్సరాలుగా శాంతియుతంగా జరిగిన పోరాటానికి సబ్బండవర్గాలు మద్దతు ప్రకటిస్తున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో ఇటీవల పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు బొడ్డు హుస్సేన్(ఎస్ఏ హిందీ ),రెమిడాల. సైదులు (పిడి),బొజ్జ మధు (పిడి)లను ఘనంగా సన్మానించడం జరిగింది.ఎంఈఎఫ్ కోదాడ డివిజన్ అధ్యక్షులు నందిగామ ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా
ఏపూరి పర్వతాలు ( రాష్ట్ర కార్యవర్గ సభ్యులు),పిడమర్తి సైదులు ( రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్),బొల్లికొండ కోటయ్య(గౌరవ సలహాదారులు),చేకూరి రమేష్ (జిల్లా ఉపాధ్యక్షులు),నందిపాటి సైదులు (ఎంఇఎఫ్ హుజూర్ నగర్ డివిజన్ అధ్యక్షులు),కుడుముల స్వామి దాసు పాల్గొని మాట్లాడుతూ ఫిబ్రవరి 7న మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ-వర్గీకరణ కొరకు జరిగే లక్ష డప్పులు-వెయ్యి గొంతులు కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు.అదేవిధంగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు ఉత్తిపట్ల అంకిత భావంతో పనిచేస్తూ బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మాదాసు బాబు,ఉపాధ్యక్షులు కనకం అక్షపతి,కోశాధికారి గంధం బుచ్చారావు,జాయింట్ కార్యదర్శి పులి శ్రీనివాస్,ప్రచార కార్యదర్శి: ఏపూరి గురుస్వామి,సీనియర్ నాయకులు యలమర్తి శౌరి,నందిపాటి రవి,కోట స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.