లడ్డును 18, 116/ రూ పాడి దక్కించుకున్న కాసిని పాండు
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 05(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణం లో స్థానిక శ్రీ విజయ గణపతి గణపతి స్వామి వారి దేవాలయం లో జరిగిన గణేష్ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కోదాడ డిఎస్పి మామిళ్ళ శ్రీధర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి లడ్డు పాటలు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పాటలో కాసిని పాండు దంపతులు 18వేల16 రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు. అలాగే ఓరుగంటి పురుషోత్తం దంపతులు 17 వెల ఒక్క రూపాయికు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం విజయ గణపతి ఆలయంలో స్వామివారి సన్నిధికి మోసుకు వెళ్ళారు. ఈ సందర్భంగా కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఆ విజయ గణపతి స్వామి వారి దయతో కోదాడ నియోజకవర్గ ప్రజలందరూ అన్ని రంగాలలో విజయం సాధించి సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని స్వామి వారిని మొక్కుకున్నాని తెలిపారు.ఈ కార్యక్రమం లో వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షులు సలపాటి రామారావు, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి కృష్ణయ్య, అంబటి శ్రీను, సలపాటి శివకృష్ణ, కందరబోయిన చిన్న యాదాద్రి, ఉపేందర్, రాంబాబు, ఓరుగంటి రాము, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలను అందించారు.



