లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను మంజూరు చేయాలి:టిఆర్ఎస్ నాయకులు మామిడి రామారావు..
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 14(ప్రతినిధి మాతంగి సురేష్):లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలి అని టిఆర్ఎస్ నాయకులు మామిడి రామారావు అన్నారు. గురువారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సూర్యనారాయణ కు లబ్ధిదారులతో కలిసి వినతిపత్రం అందించి మాట్లాడారు.గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు మంజూరు చేయాలి అని అన్నారు.వారి వెంట డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.