Tuesday, July 8, 2025
[t4b-ticker]

లాభసాటి పాడి పోషణ కి రైతు దొడ్లో సంవత్సరానికో దూడ పది మసాల పాడి

లాభసాటి పాడి పోషణ కి రైతు దొడ్లో సంవత్సరానికో దూడ పది మసాల పాడి

ఈతలు మధ్య అంతరం తగ్గితేనే రైతు జేబు గలగల లేదంటే విలవిల

పశు ఆరోగ్యమే ప్రజారోగ్యం

పచ్చి పశు గ్రామమే పాడికి మూలాదారం- డా . దాచేపల్లి శ్రీనివాసరావు

Mbmtelugunews//కోదాడ, జులై 08 (ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణంలోని బాలాజీ నగర్ లో శ్రీ సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ మరియు పశుసంవర్డక మరియు పశు సంవర్ధక శాఖ సంయుక్తంగా నిర్వహించిన పశు ఆరోగ్యం శిబిరంలో పశు పోషకులకు ఖనిజ లవణ మిశ్రమం, పశుగ్రాస విత్తనాలు, కాల్షియం టానిక్ లు అందించిన జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక అధికారి డా .దాచేపల్లి శ్రీనివాసరావు. అలా పశువు ఉత్తమ లక్షణాలతో రైతులకు పాల సిరులు కురిపించాలంటే సమయానుకూలంగా దానికి కావలసిన పోషకాహారం అందించాలని, కానీ ప్రస్తుతం సామాజిక ఆర్ధిక పరిస్థితుల రీత్యా తరిగిపోతున్న పచ్చిక బయల్ల కారణంగా సరియైన పోషణ అందక స్థూల సూక్ష్మ ధాతు మూలకాల లోపంతో సంవత్సరాల తరబడి పశువులు సూడి కట్టకుండా రైతుకు పెనుభారంగా మారుతున్నాయి. దీనిని అదిగమించడానికి రైతులంతా విధిగా పశువు ఈనిన మూడు మాసాల్లోనే తిరిగి సూడి మోయించుకోవాలని, అంతకు మించి ఆలస్యం అయితే పాడి తగ్గినకొలది మేత కూడా తగ్గి దీర్ఘ కాలం పశువు సూడి మోయకుండా పోతుందని తెలుపుతూ పశువుకి ప్రతీ రోజు 50 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం, నెలలో పదిరోజులు కాల్షియం, మూడు మాసాలకి ఒక మారు నత్తల నివారణ మందులు ఇవ్వాలని సూచించారు. స్థానిక అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య మాట్లాడుతూ బాలాజీ నగర్ లో అత్యంత విలువైన మేలు జాతి పశుపోషణతో ఇక్కడి రైతులు ఆర్ధిక భరోసాతో ఉపాధిపొందుతున్నారని, పెరిగిన రద్దీ రోడ్డు ద్వారా పశువుల్ని తోలుకొని పశువైద్యశాలలకు రావడం ఇబ్బందిగా ఉన్నందున బాలాజీ నగర్ లో స్థానికంగా కొన్ని సేవలందించడానికి ప్రభుత్వ భూమిని ఇచ్చినట్లయితే బాలాజీ నగర్ లోని కోళ్ల ఫారం యజమాని కిరణ్ పశువుల చికిత్సకి షెడ్డు ట్రేవిస్ నిర్మించడానికి ముందుకు వచ్చారని అందరూ కలిసి అట్టి స్థలాన్ని చూపించినట్లయితే సత్వరమే షెడ్డు నిర్మించి వార్డు రైతులకు పశువైద్య సేవలను మరింత అందుబాటులోకి తెస్తామని కోరారు. మూగ జీవాల పురోభివృద్ధికి తమ సహాయంగా జిల్లాలో 18 పశుఆరోగ్యశిరాలు నిర్వహించడానికి ముందుకు వచ్చిన శ్రీ సత్య సాయి సేవా సమితి ట్రస్ట్ కి కృతజ్ఞతలు తెలిపారు. 84 పశువులకి గర్భకోశవ్యాధులకి చికిత్సలు 157 దూడలకు నట్టల నివారణ, 65 పశువులకి పేలు గోమార్ల నిర్వహణ, 44 పశువులతో సాధారణ చికిత్సలు అందించిన ఈ పశు ఆరోగ్య శిబిరంలో శ్రీ సత్య సేవా సమితి సేవకులు నీటిపారుదల శాఖ ఎక్జిక్ట్యూటివ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి, కోదాడ, చిలుకూరు, మునగాల, హుజూర్నగర్, అనంతగిరి మండలాల పశువైద్య సహాయ శస్త్రచికిత్సలు డా బి మధు, డా, కే వీరారెడ్డి, డా, శ్రీనివాస్, డా, మమత, డా, హరిత, డా, శ్రీనివాసరెడ్డి, డా, సురేంద్ర, శ్రీ సత్యసాయి సేవాసమితి జిల్లా ఇంచార్జి బాబురావు, పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular