సూర్యాపేట,ఏప్రిల్ 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఉష్ణోగ్రతలు నానాటికి పెరుగుతుండడం,ఎండకు తోడు వడగాలులు సైతం వీస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు కోరారు.జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలేక్టర్ చాంబర్ నందు జిల్లా ఆదనపు కలేక్టర్ బిస్ లత,వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి వడదెబ్బ పై పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ప్రజలు ఎండ నుంచి రక్షణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.ఉష్ణోగ్రత పెరుగుతున్న దృశ్యా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.వడదెబ్బ బారిన పడితే 108కు సమాచారం ఇస్తే సిబ్బంది తక్షణం అక్కడకు చేరుకొని చికిత్స అందిస్తారని,దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్తారని తెలిపారు.ప్రతి మండలంలో మెడికల్ ఆఫీసర్,సూపర్వైజర్ ఏఎన్ఎంలతో కూడిన టీం ఏర్పాటు చేశామని వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారి ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.ఖద్దరు దుస్తులు ధరించి,బయటకు వెళ్ళినప్పుడు గొడుగు చలవ కళ్లద్దాలు ధరిస్తే మంచిదని ఎండ వేడిమి కి శరీరంలో నీరు ఆవిరి కానందున దాహం వేసినా వేయకున్నా తరచుగా మంచినీళ్లు తీసుకోవడం మంచిదని,పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని,మద్యం కాఫీ టీలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.అన్ని శాఖల సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిటిడిఓ శంకర్,డిఎం శర్మ,ఎఒ సుదర్శన్ రేడ్డి,ఎస్సీ వేల్పర్ ఆదికారిణి లత,డిపిఆర్ఓ రమేష్ కుమార్,డీఎస్ఓ మోహన్ బాబు,డిఎఫ్ఓ రూపేందర్ సింగ్,సిపిఓ దున్న శ్యామ్,వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటచలం,జిల్లా టాస్క్ ఫోర్స్ బృంద సభ్యులు,ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వెంకటరమణ,డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.



