వరద బాధితులకు అండగా నిలవడం అభినందనీయం……
:విద్యార్థులు చిన్ననాటి నుంచి సామాజిక సేవను అలవర్చుకోవాలి……..
:సేవా కార్యక్రమాలతో భావితరాలకు ఆదర్శంగా నిలవాలి……..
:మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్……
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 20(ప్రతినిధి మాతంగి సురేష్):విద్యార్థులు చిన్ననాటి నుంచి సామాజిక సేవా దృక్పథాన్ని అలవర్చుకొని భవితరాలకు ఆదర్శంగా నిలవాలని కోదాడ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల రమేష్ అన్నారు.శుక్రవారం పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు వరద బాధితుల సహాయార్థం విద్యార్థులు సేకరించిన 20వేల రూపాయల విరాళాలతోటి పట్టణంలోని 13 వ వార్డు చెరువు కట్ట కింద గల లోతట్టు ప్రాంత వరద బాధిత పేదలకు బియ్యంతో పాటు14 రకాల నిత్యవసరాల సరుకులను పంపిణీ చేసి మాట్లాడారు.పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే సామాజిక సేవా దృక్పథం, మానవతా విలువలు పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. విద్యార్థులు బాల్యం నుంచి సహాయ గుణాన్ని పెంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి,డివిజన్ విద్యాధికారి సలీం షరీఫ్,మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,స్థానిక కౌన్సిలర్ లంకెల రమ నిరంజన్ రెడ్డి,ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మార్కండేయ,ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి,లింగయ్య,ఖాజా,బడుగుల సైదులు,రామకృష్ణ,జానకి రామ్,ముక్తార్,పాండురంగ చారి,వేణు కుమార్,చిన్నప్ప,మీనాక్షి,పద్మావతి,కరుణ,రాణి,విజయ తదితరులు పాల్గొన్నారు.