వరద బాధితులకు అండగా నిలిచి ఆదుకున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుదీర్
Mbmtelugunews//(నడిగూడెం), ఆగస్టు 14 (ప్రతినిది మాతంగి సురేష్): నడిగూడెం మండల కేంద్రంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ముంచెత్తిన భారీ వరద. లోతట్టు ప్రాంతాలు అయినా ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలు జలమయం అయ్యి ఇళ్లలోకి చేరిన వరద నీరు. రాత్రి పగలు ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన స్థానిక ఎస్సై, ఎంఆర్ఓ, కార్యదర్శి, యువకుల తో కలిసి ఎలాంటి నష్టాలు జరగకుండా చర్యలు చేపట్టిన మార్కెట్ కమిటీ చైర్పర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్. అనంతరం వరద బాధితులకు అల్పాహారాలు అందించి వారికి చేదోడువాదోడుగా నిలిచిన చైర్ పర్సన్. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ఎవ్వరి ఇళ్లల్లోకి వరద వచ్చినట్లయితే సంబంధిత అధికారులకు యూత్ పిల్లలకు ఫోన్ చేసినట్లయితే వారి తక్షణమే స్పందించి మిమ్ములను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని తెలిపారు. వర్షం కురిసే సమయంలో ఎవరూ కూడా అధైర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిదీ గమనించుకుంటూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, యూత్ పిల్లలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



