వరద బాధితులకు ప్రభుత్వ సహాయం అందకపోతే సంబంధిత అధికారులకు తెలియజేయాలి:ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 10:చిలుకూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలోని చెరువు కట్ట తెగి సర్వం కోల్పోయిన వరద బాధితులను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మంగళవారం మరో మారు పరామర్శించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సహాయం అందకపోతే తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేయాలని వారిని కోరారు.అధికారులు కూడా ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి వారికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూడాలని ఆదేశించారు.అంతకుముందు వరదల్లో ఇండ్లు కోల్పోయిన వారు తాత్కాలికంగా నివాసం ఉండేందుకు ఐరన్ షీట్స్ తో తయారుచేసిన మోడల్ హౌస్ ను పరిశీలించారు.కార్యక్రమంలో తహసిల్దార్ ధ్రువకుమార్,ఎంపీడీవో గిరిబాబు,పంచాయతీరాజ్ ఏఈ లక్ష్మారెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు.