వరద బాధితులకు వస్త్రాల పంపిణీ.
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 10:కోదాడ శాసన సభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి పిలుపుమేరకు కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గరిణే శ్రీధర్ తన సొంత ఖర్చులతో నూతన వస్త్రాలను మంగళవారం పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు వరద బాధితుల సహాయ నిధి ఇంచార్జ్ మల్లేశ్వరి లకు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోదాడ పట్టణం తో పాటు మండల పరిధిలోని తొగర్రాయి కూచిపూడి అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామాలు ముంపుకు గురి కావడంతో పలు కుటుంబాలు వారు నిరాశ్రయులయి సర్వం కోల్పోయిరని తెలిపారు.దాతలు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆవోపా పట్టణ అధ్యక్షుడు యిమ్మడి రమేష్,వైశ్య సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి పందిరి సత్యనారాయణ,గునుగుంట శ్రీనివాసరావు,వెంపటి ప్రసాద్,గుడుగుంట్ల సాయి,బెలీదే భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.