వరద బీభత్సానికి అతలాకుతలమైన కూచిపూడి పెట్రోల్ బంక్
:కూచిపూడి ఐఓసీ పెట్రోల్ బంక్ లో భారీ నష్టం
:బంకు చుట్టూ కూలిన ప్రహరీ గోడ
:బంకు కరెంట్ ట్రాన్స్ ఫార్మర్,స్తంభాలు కూలి కింద పడ్డవి
:బంకులో జనరేటర్,ఎయిర్ మిషన్ పూర్తిగా ధ్వంసం
:బంకులో 7 లక్షల నుండి 8 లక్షల వరకు భారీ నష్టం,నష్టంతో ఇబ్బంది పడుతున్న బంక్ డీలర్
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 02:సూర్యాపేట జిల్లాలో శనివారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోదాడ మండల పరిధిలోని కూచిపూడి గ్రామము,గ్రామంలో గల ఐఓసీ పెట్రోల్ బంక్ పూర్తిగా ధ్వంసం అయ్యి 7 లక్షల నుండి 8 లక్షల వరకు భారీ నష్టం జరిగింది. బంక్ డీలర్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో శనివారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మా బంకులో కరెంట్ ట్రాన్స్ ఫార్మర్,కరెంటు స్తంభాలు,బంకు చుట్టూ ప్రహరీ గోడ,జనరేటర్,ఎయిర్ మిషన్ లు పూర్తిగా ధ్వంసమై భారీ నష్టం జరిగిందని తెలిపారు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండల పరిధిలోని నారాయణపురం చెరువు గండిపడటంతో నీటి ప్రవాహం ఎక్కువ అంతర్గంగా వాగు ఉప్పు ఉండటంతో మా గ్రామ పరిధిలోని ఐఓసీ బంకులో భారీ నష్టం జరిగిందని అంతేకాకుండా గ్రామం మొత్తం జలమయిపోయిందని తెలిపారు.