వరవరరంగనాయక స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం:దేవాలయ చైర్మన్ ఈర్ల లక్ష్మారెడ్డి…
కోదాడ,జులై 11(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని గణపవరం గ్రామంలో ని వరవర రంగనాయక స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం దేవాలయ డివిజన్ ఇన్స్పెక్టర్ ఈ రమేష్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ గా ఈర్ల లక్ష్మారెడ్డి,ధర్మకర్తలుగా కంపసాటి నాగేశ్వరరావు,లింగంపల్లి బిక్షం,బల్గూరి సైదులు,సాయిని సీతయ్య,కుక్కడపు గురవయ్య,ఉల్లి నాగలక్ష్మి లను ఎన్నుకున్నారు.నాయకులు గ్రామస్తులు వారిని ఘనంగా సన్మానించారు.అనంతరం అడ్వకేటు కామిశెట్టి వెంకటేశ్వర్లు దేవాలయ చైర్మన్ ను శాలువా,పూలమాలతో ఘనంగా సత్కరించారు.దేవాలయ చైర్మన్ ఈర్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.

అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్స్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి,టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ కేఎల్ఎన్ ప్రసాద్,అడ్వకేట్ కామిశెట్టి వెంకటేశ్వర్లు,సీనియర్ నాయకులు ఈర్ల సీతారామరెడ్డి,ఈర్ల నారపరెడ్డి, సింగారెడ్డి సుమన్ రెడ్డి,గ్రంథాలయ చైర్మన్ వట్టికూటి వెంకటేశ్వరరావు,జాబిశెట్టి నాగప్రసాద్,బండి చిన్న కాటయ్య,షేక్ జానీ,కార్యదర్శి వెంకట చలపతి,శంభిరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.
Pls subscribe to my channel https://www.youtube.com/live/0_KjbD240G4?si=oNdQ779d_tKUaZ7s