Saturday, December 27, 2025
[t4b-ticker]

వర్తక వాణిజరంగాల్లో కోదాడ ను అగ్రస్థానంలో నిలపాలి.:కోదాడ వర్తక సంఘం సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలి.

:వ్యాపారంలో నైతిక విలువలు పాటించాలి:కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల,డీఎస్పీ శ్రీధర్ రెడ్డి

కోదాడ,ఫిబ్రవరి 25(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:వర్తక వాణిజ రంగాల్లో కోదాడను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్,డిఎస్పి శ్రీధర్ రెడ్డి లు అన్నారు.ఆదివారం కోదాడ పట్టణంలోని వర్తక సంఘం భవన్ లో కోదాడ వర్తక సంఘం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం లో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతు వర్తక వాణిజ్య రంగాల అభివృద్ధితో కోదాడ అభివృద్ధి సాధిస్తుందన్నారు.వర్తక సంఘం ఆర్థిక పురోగతి సాధించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు.వ్యాపారంలో నైతిక విలువలు పాటించి పేరుపొందాలన్నారు.ఈ సందర్భంగా వర్తక సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికైన మేళ్లచెరువు కిషోర్,ప్రధాన కార్యదర్శిగా కొత్తూరు పూర్ణచంద్రరావు,కోశాధికారిగా కొత్త శ్రీనివాసరావు,ఉపాధ్యక్షులుగా బండారు వెంకటేశ్వర్లు,చల్లా విజయ్ శేఖర్,కందిబండ శ్రీనివాసరావు,చిన్న బ్రహ్మం,వంగవీటి శేఖర్,సురేందర్ కుమార్,జాయింట్ సెక్రటరీ చీదేళ్ల సురేష్,సత్యనారాయణ, దుర్గారావు,ఇరుకుల్ల రాధాకృష్ణ,గాధం శెట్టి సంతోష్,ఉప కోశాధికారిగా మేళ్లచెరువు వెంకన్నలు ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం నూతన కార్యవర్గాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పట్టణ నాయకులు,వర్తక సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి,వంగవీటి రామారావు,పైడిమరి సత్తిబాబు,పారా సీతయ్య,యాదా రమేష్,మేకల శ్రీనివాసరావు,ముత్యాలు,రాయపూడి వెంకటనారాయణ,గాదంశెట్టి శ్రీనివాసరావు,పైడిమర్రి వెంకటనారాయణ,కొత్త వెంకటేశ్వర్లు,సామినేని రమేష్, వంగవీటి నాగరాజు,చారుగుండ్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నంబర్ 9666358480 కి పంపించగలరు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular