వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
:మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్నేని వెంకటరత్నం బాబు.
Mbmtelugunews//కోదాడ, జులై 25(ప్రతినిది మాతంగి సురేష్): మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తున్న దృష్ట్యా నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోదాడ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు.మట్టి మిద్దెలు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,చెరువు పరివాహక ప్రాంతంలో నీటిలోకి ఎవరు వెళ్లొద్దు పశువుల సైతం నీటిలోకి తీసుకెళ్లకుండా జాగ్రత్త వహించాలి, విద్యుత్ స్తంభాలకు ట్రాన్స్ఫార్మర్లకు షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు వాటి దగ్గరకు వెళ్లొద్దని సూచించారు..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.



