Tuesday, July 8, 2025
[t4b-ticker]

వాతావరణంలో మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి:డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి:అత్యధిక వర్షాలు వచ్చే సమయంలో అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 040 24651119/9908595187/ 14416 లకు ఫోన్ చేయాలి

కోదాడ,జులై 27(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని గుడిబండ గ్రామంలోని పల్లె దవాఖానా ను జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల వల్ల మానవుని శరీరంపై ప్రభావం చూపిస్తాయని,నీటి సంబంధిత,ఆహార సంబంధిత మరియు కీటక జనిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అత్యవసర సహాయానికి 040 24651119 నెంబర్ కి ఫోన్ చేయవచ్చని లేదా 9908595187 నెంబర్ కి ఫోన్ చేయవచ్చు అని తెలిపారు.గర్భిణీ స్త్రీలు ఇటువంటి విపత్కర పరిస్థితిలో 102 వాహనం కొరకు సంప్రదించవచ్చని అన్నారు.నీళ్ల విరోచనాలు అయ్యేవాళ్ళు ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించి ఓ.ఆర్.ఎస్ ను ఉపయోగించాలని అన్నారు.అనంతరం గ్రామంలో కొన్ని గృహాలను సందర్శించారు.ప్రజలు తమ పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా ప్రజలు చూసుకోవాలని అన్నారు.ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వ ఉండే ప్రదేశాలు ఉంటే కిరోసిన్ కానీ మడ్ ఆయిల్ కానీ ఉపయోగించడం వల్ల దోమలు పెరగకుండా చూసుకోవచ్చు అని అన్నారు.ఆయిల్ బాల్స్ తయారీ విధానం తెలియజేశారు.అవసరమైన చోట్ల గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.గ్రామాలలో పంచాయతీ సెక్రెటరీ,ఇతర అధికారుల సమన్వయంతో ఆరోగ్య సిబ్బంది పనిచేయాలని తెలిపారు.దోమలు పుట్టకుండా మరియు కుట్టకుండా చూసుకోవాలని అన్నారు.తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన వారు 14416 ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి సూచనలు సలహాలు తీసుకోవాలని అన్నారు.నీటిని కాచి చల్లార్చి వడగట్టి వాడుకోవడం అత్యుత్తమైన మార్గమని దీని వల్ల నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ఎక్కువ శాతం అరికట్టవచ్చని అన్నారు.ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే విధానాన్ని పాటించాలని కోరారు.ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.వీరితో పాటు కాపుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ధర్మ తేజ,గుడిబండ పల్లె దవాఖాన వైద్యురాలు డాక్టర్ సుష్మ,సూపర్వైజర్ సిద్ధమ్మ,ఆరోగ్య కార్యకర్తలు లక్ష్మి సుధా,చంద్రకళ, ఆశా కార్యకర్తలు కళావతి,సుజాత తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular