వాలీబాల్ టీంకు ప్రాతినిధ్యం వహించిన తోట శ్యామ్ కు సన్మానం
Mbmtelugunews//కోదాడ,జనవరి 05(ప్రతినిధి మాతంగి సురేష్):గత నెలలో కేరళలో జరిగిన సౌత్ జోన్ వాలీబాల్ క్రీడలకు అనంతగిరి మండలం నుంచి మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాలీబాల్ టీంకు ప్రాతినిధ్యం వహించిన తోట శ్యామును ఆదివారం జడ్పిహెచ్ఎస్ వాకర్స్ క్లబ్ వాలీబాల్ అసోసియేషన్ తరపున ప్రముఖ న్యాయవాది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఈదుల కృష్ణయ్య యాదవ్ ఆధ్వర్యంలో కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల నర్సింహారావు సౌజన్యంతో వాలీబాల్ క్రీడాకారుడు శ్యామును సన్మానించడం జరిగింది.ఇటి కార్యక్రమంలో సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు పిడి రవికుమార్,వెంకటయ్య,జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు కళ్యాణ్,సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఈదుల కృష్ణ యాదవ్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను వెలుగులోనికి తీసుకొని రావడానికి నా వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమ తదనంతరం క్రీడాకారులందరికి ఫ్రూట్స్ పంపిణీ చేశారు