Sunday, December 22, 2024
[t4b-ticker]

వాసవి యూత్ క్లబ్ సామాజిక సేవలు అభినందనీయం

- Advertisment -spot_img

వాసవి యూత్ క్లబ్ సామాజిక సేవలు అభినందనీయం

ఉచిత ఆయుర్వేద మెగా వైద్య శిబిరం ప్రజలకు ఎంతో ఉపయోగం

హైదరాబాదు నుండి మెగా వైద్య శిబిరానికి వైద్యులు రావడం ప్రశంసనీయం…..

ఆయుర్వేద వైద్య సేవల ప్రయోజనాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి… టిపిసిసి డెలిగేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి

వాసవి యూత్ క్లబ్ ఆయుర్వేద ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన……….

Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 08(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ వాసవి యూత్ క్లబ్ సామాజిక సేవలు ప్రశంసనీయమని టిపిసిసి డెలిగేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి,సూర్యాపేట గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు లు అన్నారు.ఆదివారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో కోదాడ వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద మెగా వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు.ఆయుర్వేద వైద్యంలో నిపుణులైన వైద్యులు హైదరాబాద్ నుండి కోదాడకు వచ్చి పట్టణ ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించడం ప్రశంసనీయమన్నారు.పట్టణ ప్రజలు వాసవి క్లబ్ సామాజిక సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయన్నారు ఆయుర్వేద వైద్యం రోగాలను శాశ్వతంగా నివారిస్తుంది అన్నారు.ఈ సందర్భంగా హైదరాబాదు నుండి వచ్చిన వైద్యులను వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.సుమారు 500 మంది రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వాసవి యూత్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు ఇమ్మడి అనంత చక్రవర్తి,డాక్టర్ వంగవీటి భరత్ చంద్ర,మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,జిల్లా పెట్రోలియం డీలర్స్ సంఘ అధ్యక్షులు ఇమ్మడి రమేష్,నాయకులు పైడిమర్రి సత్యబాబు,గరినే శ్రీధర్,ఓరుగంటి పాండు,ఖదీర్,రాయపూడి వెంకటనారాయణ,కొమరగిరి రంగారావు,పందిరి సత్యనారాయణ,వాసవి క్లబ్ బాధ్యులు పబ్బ గీత,చల్లా లక్ష్మీనరసయ్య,గుడుగుంట్ల అఖిల్,బెలీదే భరత్,ఓరుగంటి నిఖిల్,వైద్యులు శ్రీజా రెడ్డి,లక్ష్మీ ప్రసన్న అమృత,హరీష్ ,సుప్రీమ్,ప్రవల్లిక,మేఘనాథ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular