విఘ్నాలు తొలగి విజయాలు కలగాలి… మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం (బాబు)
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 27(మనం న్యూస్): విఘ్నాలు తొలగి విజయాలు కలగాలని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని శకుంతల ధియేటర్ లో గణేష్ విగ్రహం ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.గణేష్ ఉత్సవాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక లోకానికి గణేష్ ఉత్సవాలు ప్రతీక లు అన్నారు. అర్చకులు విష్ణుభట్ల హరి ప్రసాద్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఎర్నేని బాబు దంపతులు, నాయకులు రావెళ్ల కృష్ణా రావు, నెమ్మది దేవమణి ప్రకాష్ బాబు, లైటింగ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.



