విద్య,ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికి సహకరించడం అభినందనీయం:మాజీ ఎమ్మెల్యే చందర్ రావు,టీపీసీసీ డెలిగేట్ లక్ష్మీ నారాయణ రెడ్డి
కోదాడ,జూన్29(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:దాతృత్వం తో తల్లిదండ్రుల పేర్లు సమాజంలో చిరస్థాయిగా నిలిచి పోతాయని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,టిపిసీసీ డెలిగేట్ సిహెచ్ లక్ష్మీ నారాయణ రెడ్డి లు అన్నారు.శనివారం కోదాడ రామలయం లో,తమ్మర హై స్కూల్ లో,కోదాడ బాలికల పాఠశాలలో ప్రజల దాహార్తి తీర్చడానికి సజ్జా సూర్య నారాయణ,సరోజిని,ల ద్వితీయ వర్ధంతి సందర్భంగా రెండు లక్షల
విలువగల ప్యూరిఫైడ్ వాటర్4 ప్లాంట్లు సుమారు 10 లక్షల విలువ గలవి వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసినారు.ఈ ప్లాంట్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి లు పాల్గొని ప్లాంట్ ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ సజ్జ సూర్యనారాయణ,సరోజిని,ఎర్నేని వెంకటేశ్వరరావు,శకుంతల జ్ఞాపకార్థం విద్య,ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికి సజ్జా త్రివేది చేయూతనివ్వడం ఆదర్శనీయమన్నారు.పాఠశాలలో విద్యార్థులు,దేవాలయంలో భక్తులు దాతలు ఏర్పాటుచేసిన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.భవిష్యత్తులో సబ్జా త్రివేది మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.అనంతరం హుజూర్ నగర్ రోడ్డులో అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేశ్,మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం(బాబు),డిసిసిబి మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు,పైడిమర్రి సత్యబాబు,గుళ్లపల్లి సురేష్3 వార్డు కౌన్సిలర్ సామినేని నరేష్,దాతలు సబ్జా త్రివేది,హైమావతి,సరోజినీ,నరేష్ కుమార్,సజ్జ మోహన్ రావు,నాగమణి,వేనేపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.