విద్య,వైద్యం ప్రభుత్వ బాధ్యత
ప్రభుత్వ బడులు నిలబడాలి.. చదువులో అంతరాలు పోవాలి… పౌరస్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కేఏ మంగ
తెలంగాణ పౌరస్ స్పందన వేదిక కోదాడ డివిజన్ నూతన కమిటీ ఎన్నిక
కోదాడ,ఆగష్టు 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పేదలకు నాణ్యమైన విద్య వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని తెలంగాణ పౌరస్ స్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కే మంగ అన్నారు.ఆదివారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో పౌర స్పందన వేదిక కోదాడ డివిజన్ జనరల్ బాడీ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.పాఠశాలల్లో వైద్యశాలల్లో ఉన్న సమస్యలను పౌర స్పందన వేదిక సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందించిందన్నారు.ప్రభుత్వ విద్య వైద్య రంగాన్ని కాపాడుకోవడమే పౌర స్పందన వేదిక లక్ష్యమన్నారు.పౌర స్పందన వేదికలో ఎవరైనా సభ్యులుగా చేరవచ్చు అన్నారు.ప్రభుత్వ పాఠశాలలు నిలబడాలని చదువుల్లో అంతరాలు తగ్గించాలని పౌరస్ స్పందన వేదిక కృషి చేస్తుందన్నారు.అనంతరం జిల్లా అధ్యక్షులు ఆర్ ధన మూర్తి అధ్యక్షతన పౌర స్పందన వేదిక కోదాడ డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు.డివిజన్ అధ్యక్షునిగా ఎస్బిఐ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ వి వెంకటరమణ,ఉపాధ్యక్షులుగా డి పద్మావతి,నాగుల పాషా,ప్రధాన కార్యదర్శిగా రిటైర్డ్ ఉపాధ్యాయులు టి వీరబాబు,కోశాధికారిగా షేక్ ఖాజా మియా,కార్యదర్శులుగా చందా శ్రీనివాసరావు,ఎస్ నరసింహారావు,టి పురుషోత్తమరావు ఏం జనార్ధన్ ఎండి హమీద్ ,జీ వెంకటేశ్వర రెడ్డి తో పాటు మరో 10 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఆర్ ధనమూర్తి,అంకతి మల్లికార్జున్,వెంకటనారాయణ,నరసింహారావు తదితరులు పాల్గొన్నారు