విద్యానగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
:పూజలలో పోటెత్తిన మహిళలు
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 30 (ప్రతినిది మాతంగి సురేష్): నాలుగవ రోజు పట్టణంలోని విద్యానగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో
మండపం వద్ద మహిళలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎర్నేని కుసుమ వెంకటరత్నం ప్రారంభించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కపూజా కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.

పట్టణ ప్రజలు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నామని ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమంలో 4 వేల మంది పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. మా విద్యానగర్ కాలనీవాసులకు ఈ గణేష్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి ధనమ్మ, తోట జ్యోతి, దుర్గ, రజిని, జ్యోతి, హిందూ, నారపరెడ్డి, ఎం నరసింహారావు, ఎం నాగరాజు, కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు



