Saturday, March 7, 2026
[t4b-ticker]

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.కౌన్సిలర్ మామిడి రామారావు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.కౌన్సిలర్ మామిడి రామారావు.

కోదాడ, మర్చి 07(ప్రతినిధి మాతంగి సురేష్):విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోవింద్ పూర్తిగా విఫలమయ్యాడని కోదాడ మున్సిపాలిటీ కొమరబండ 10వ వార్డు కౌన్సిలర్ మామిడి రామారావు ఆరోపించారు. కొమరబండ లో అమ్మ ఆదర్శ పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులకు సరైన మెనూ పాటించకుండా నాసిరకమైన బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో వచ్చిన నిధులను పాఠశాల ఆవరణలో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. పూర్వ విద్యార్థులు, దాతలు ఇచ్చినటువంటి డొనేషన్లను దాతలకు సరైన లెక్కలు చూపించకుండా దాటవేసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ని అందించిన ఘనత కేసిఆర్ కి దక్కిందన్నారు.ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నా స్థానిక ప్రధానోపాధ్యాయుడు తన వ్యక్తిగతమైన పనులు తప్ప పాటశాలకు కాని,విద్యార్ధుల అభివృద్ధికి కాని ఎటువంటి ప్రాణాలికలు కాని లేవు అన్నారు.ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రధానోపాధ్యాయుడిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బత్తుల కృష్ణ, అరుణ్, జలందర్, నాగుల్, రమేష్, అఖిల్, గోపి, మునీర్, గోపి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular