కోదాడ,జులై 07(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:విద్యతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శుక్రవారం కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బి వి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్య,వ్యవసాయ, సామాజిక రంగాలకు తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణలో భాగంగా మన ఊరు మనబడి పథకంతో వేల కోట్ల రూపాయల నిధులను పాఠశాలల అభివృద్ధికి కేటాయించిందన్నారు.ఈ పథకం తో పాఠశాలల రూపురేఖలు మారాయి అన్నారు.నేడు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యానందిస్తుందన్నారు.పాఠశాలల బలోపేతానికి సమాజ భాగస్వామ్యంలో భాగంగా దాతలతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.బివిఆర్ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తమ ఊరు కోసం బడి కోసం ఎంతో కొంత చేయాలని సూచించారు.అన్ని దానాలో కన్నా విద్యాదానం ఎంతో గొప్పది అన్నారు.డిఎస్పి వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దాతల సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలకు ఎదగాలన్నారు.అనంతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు బుర్ర పుల్లారెడ్డి మాట్లాడుతూ బివిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.విద్యా వైద్యం పేదలకు అందించాలని లక్ష్యంతోనే ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీలు చింత కవిత రాధారెడ్డి,చుండూరు వెంకటేశ్వరరావు,వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి,బుర్ర వెంకటరెడ్డి,ఫౌండేషన్ కోశాధికారి బుర్ర ప్రమోద్ రెడ్డి,పిఎసిఎస్ గూండ్రియాల మాజీ చైర్మన్ బుర్ర నర్సిరెడ్డి,మాజీ సర్పంచ్ లు పి సత్యబాబు,గ్రంథాలయ చైర్మన్ రహీం,బుర్ర రాఘవరెడ్డి,బుర్ర గోవిందరెడ్డి,బుర్ర బస్వి రెడ్డి,రిటైర్డ్ హెచ్ఎం ముతౌట్ రామారావు,ప్రభుత్వ ఉపాధ్యాయులు షేక్ రెహమాన్,స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ శ్రీనివాస్ రెడ్డి,ఉపాధ్యా యులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు బివిఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం.:విద్య,వైద్య,సామాజిక రంగాల సేవల లక్ష్యంగా బివిఆర్ ఫౌండేషన్ ఏర్పాటు కావడం అభినందనీయం:ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
RELATED ARTICLES