విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలి:సామినేని ప్రమీల రమేష్
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 20 ప్రతినిధి మాతంగి సురేష్: విద్యార్థులకు తల్లిదండ్రులు మంచి పౌష్టిక ఆహారాన్ని అందించినట్లయితే వారు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారని మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ అన్నారు.మంగళవారం
స్థానిక బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ఐ స్క్రీన్ టెస్టుల క్యాంపును ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ పాల్గొని క్యాంప్ ను ప్రారంభించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ఐదు నుండి పదవ తరగతి విద్యార్థులకు కంటి వ్యాధులను గుర్తించి దూరపు చూపు లోప నివారణకు ప్రభుత్వం కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.విద్యార్థులకు చదువుతోపాటు కంటి ఆరోగ్యానికి తగిన సూచనలు ఐ ఎక్సర్సైజ్ పౌష్టికాహారం తీసుకోవడం చూపులోపాలని నివారించడానికి తగిన సూచనలతో విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ నిరంజన్,ఆర్ బిఎస్ కే మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ శైలజ,డాక్టర్ అశోక్ కుమార్,మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి,మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సలీం షరీఫ్,ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ,ఉపాధ్యాయులు బడుగుల సైదులు,ఏ పద్మావతి ఫార్మసిస్ట్ మంగ,ఆప్తమాలటిస్ట్ లింగయ్య,ఏఎన్ఎంలు కృషిద,కల్పన,ఆశ వర్కర్ భవాని,పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.