కోదాడ,డిసెంబర్ 29(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పాఠశాలలోని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేయాలనే దృఢ సంకల్పంతో ఆ పాఠశాల యాజమాన్యం మదిలో మెదిలిన ఒక ఆలోచన ఈనాడు కోదాడ పట్టణంలోని అనేకమంది నిరుపేదలు పాదచారులు వికలాంగులు కార్మికులు భిక్షాటన చేసే వారి ఆకలి తీర్చుతున్నది. చదువుతోపాటు అన్ని రంగాల్లో తమ విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండాలని అందుకు తగినట్టుగా విద్యార్థుల్లో దేశభక్తిని దైవభక్తిని పెంపొందిస్తూ తమ పాఠశాలలో చదువు కుంటున్న విద్యార్థులు ఉత్తమ పౌరులుగా సంస్కార వంతులుగా ఉండాలని నిరంతరం తపించే ఆ పాఠశాల యాజమాన్యం చేపట్టిన ఒక కార్యక్రమము ఈనాడు ఎంతోమంది ఆకలిని తీర్చుతుంది.

ప్రతి విద్యార్థి సేవా భావం కలిగి ఉండాలనే ఉద్దేశంతో కోదాడ పట్టణం లోని భారత్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అక్షయపాత్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ప్రతి విద్యార్థి తమ ఇంటి నుండి పిడికెడు బియ్యం తీసుకురావాలని యాజమాన్యం చెప్పిన సూచనలు పాటించిన ప్రతి విద్యార్థి అది తమ బాధ్యతగా భావించారు.విద్యార్థులు వారి ఇంటి నుంచి పిడికెడు బియ్యం తీసుకొని వచ్చారు అలా విద్యార్థులు తీసుకొచ్చిన బియ్యంతో కోదాడలోని రంగా థియేటర్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించే స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్టు వారి సహకారంతో గత రెండు వారాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.భారత్ పబ్లిక్ స్కూల్ పాఠశాల విద్యార్థులు బీదవారికి పాదచారులకు తమ స్వహస్తాలతో అన్న ప్రసాద వితరణ చేశారు.నిరంతరం రక్తదానం అన్నదానం కార్యక్రమాల ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహించే స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్,భారత్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంత్రిప్రగడ శ్రీధర్,శ్రీనివాస్,స్వర్ణ భారతీయ చాటబల్ ట్రస్ట్ సభ్యులు,భారత్ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు,విద్యార్థులు రంగా టాకీస్ స్టాప్ పాల్గొన్నారు.



