విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి
:చదువుతోపాటు క్రీడలలో విద్యార్థులు రాణించాలి
:క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దృఢత్వానికి ద్రోధ పడతాయి
:ఎంఈఓ సలీం షరీఫ్,ఏజీఎం మురళీకృష్ణ
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 05(ప్రతినిధి మాతంగి సురేష్):విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని నింపినప్పుడే వారికి మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వం ఏర్పడుతుందని ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు.శనివారం పట్టణంలోని శ్రీ చైతన్య రెసిడెన్షియల్ పాఠశాలలో డాక్టర్ బి ఎస్ రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ సలీం షరీఫ్,శ్రీ చైతన్య ఏజీఎం మురళీకృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఒత్తిడిని అధిగమించగలరని ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు.

అనంతరం విజయవాడ జోన్ ఏజీఎం మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీ చైతన్య అంటే చదువు,ర్యాంకులు ఒకటే కాదని తమ విద్యార్థులు క్రీడా పోటీలలో రాణించగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ వినోద్,దండా వెంకటేశ్వర్లు,ప్రిన్సిపాల్ గోపాలస్వామి,పూర్ణ,వీరారెడ్డి,ప్రశాంతి,టీచర్స్,విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.