కోదాడ,డిసెంబర్ 16(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలోని స్థానిక ఎస్వీ హై స్కూల్ విద్యార్థులు పాఠశాల విద్యలో భాగంగా శనివారం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ సందర్శించారు.పట్టణ ఇన్స్పెక్టర్ రాము విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ స్టేషన్ లో జరుగు వివిధ రకాల కేసుల గురించి వివరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలను సాధించి తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన కోరారు. విద్యార్థులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. పోలీస్ స్టేషన్ సందర్శన ద్వారా సివిల్ కేసులు క్రిమినల్ కేసులు పట్ల అవగాహన పొందామని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వల్లి పద్మ,సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు రాజా, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అంజయ్య,సురేష్,బాల సైదులు,జానీ,నవాజ్,సైదా,అనూష,లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి:సీఐ రాము
RELATED ARTICLES



