విద్యార్థులు చలికాలం తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన
Mbmtelugunews//సూర్యాపేట, జనవరి 02(ప్రతినిధి మాతంగి సురేష్ ):ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని కందగట్ల జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతున్న చలిపై విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలపై శుక్రవారం ప్రభుత్వ ఆయుష్మాన్ ఆర్యగ మందిర్ వైద్యులు డాక్టర్ వీరేంద్రనాథ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ముఖ్యంగా చలికాలంలో ఉదయం 7 గంటల తరువాతే బయటికి రావాలని రాత్రి 7 గంటల నుంచి బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, సైనస్, ఆస్తమా, ఉన్న విద్యార్థులు ప్రభుత్వ డాక్టర్ ని సంప్రదించి తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఉదయం పూట రాత్రి సమయంలో బయటికి వచ్చేటప్పుడు ప్రత్యేక దుస్తులు, మాస్క్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. చలికాలంలో పిల్లలు వేడి వేడి ఆహారాన్ని తీసుకోవాలని నీళ్ళు కూడా గోరువెచ్చని నీళ్లు తాగాలని అన్నారు. జలుబు జ్వరం లాంటి లక్షణాలు ఉంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పటల్ వైద్యులను సంప్రదించి డాక్టర్ సలహాలను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకొని మందులు వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సుజత, ఆశా కార్యకర్త విజయ, ప్రధానోపాధ్యాయులు మురళీ కృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



