విద్యార్థులు లక్ష్యంతో చదివి విజయాలకు చేరుకోవాలి
:బోటనీ ఎంట్రన్స్ లో 2 వ ర్యాంకు పొందిన విద్యార్థిని సౌమ్యకు అభినందన.
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 12 ప్రతినిధి మాతంగి సురేష్:విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదివి విజయాలకు చేరువ కావాలని కెఆర్ఆర్ ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.నిర్మల కుమారి అన్నారు.సోమవారం కళాశాలలో పీజీ సెట్ లో బోటనీ సబ్జెక్ట్ లో రెండవ ర్యాంకు పొందిన పి సౌమ్య ను అధ్యాపకులతో కలిసి మెమొంటో శాలువాతో సత్కరించినారు.అనంతరం ప్రిన్సిపాల్ నిర్మల కుమారి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన ఉచిత విద్య లభిస్తుందని అన్నారు.పోటీ పరీక్షల్లో విజేతలుగా మారుతున్న విద్యార్థులందరూ ప్రభుత్వ కళాశాలలోనే చదివిన వారే అన్నారు.విద్యార్థులు సామాజిక స్ఫూర్తితో ముందుకు సాగి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బోటనీ అధ్యాపకులు ఏ.రాజు,అధ్యాపకులు చందా అప్పారావు,బి సైదిరెడ్డి,శ్రీలత,సత్యవాణి,మాతంగి యాకుబ్ ఫ్రాన్సిస్,పి సైదులు,ఎస్.ఎం రఫీ,టీ రాజు,బి రాంబాబు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.