విద్యార్థులు విద్యార్థుల దశ నుండే సేవా భావాలను అలవాటు చేసుకోవాలి.
:బాధితులకు చేయూతనిద్దాం…
:వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ……
కోదాడ డివిజన్ విద్యాధికారి సలీం షరీఫ్..
.
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 14:వరద బాధితులకు చేయూతనందించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోదాడ డివిజన్ విద్యాధికారి సలీం షరీఫ్ అన్నారు.శనివారం కోదాడ పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ ఉపాధ్యాయులు,విద్యార్థులచే విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని అన్నారు.విరాళాల కొరకు తమ వద్దకు వచ్చే విద్యార్థులకు సహకరించాలని కోరారు.సేకరించిన విరాళాల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ సహాయా నిధికి అందజేయనున్నట్లు తెలిపారు.ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచి సామాజిక స్పృహ,సేవాభావం పెంపుదల కోసం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ మార్కండేయ,ఉపాధ్యాయులు,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.