Saturday, February 28, 2026
[t4b-ticker]

విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి…..

విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి…..

:పరిశోధన రంగాల్లో రాణించి శాస్త్రవేత్తల ఆశయాలు సాధించాలి…

:మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు…

Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 28(ప్రతినిధి మాతంగి సురేష్):విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సైన్స్ ఫెయిర్ ను ఆమె ప్రారంభించినారు. ముందుగా సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు.

విద్యార్థులు పరిశోధన రంగాల్లో రాణించి శాస్త్రవేత్తల ఆశయాలను సాధించాలన్నారు.సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి సలీం షరీఫ్ చైర్ పర్సన్ కు పుష్ప గుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పెండెం గురవమ్మ సైదిబాబు, ఉపాధ్యాయులు ఉన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular