విద్యార్థులు సదరన్ సైన్స్ డ్రామా పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపిక
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 10(ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన సైన్స్ డ్రామా పోటీలలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులును పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు కె రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించినారు. మానవజాతి ప్రయోజనం కోసం శాస్త్ర సాంకేతికత అనే అంశంపై విద్యార్థిలో సన్స్ పై ఆసక్తి పెంచడమే లక్ష్యమని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కోదాడ విద్యార్థులు యువతపై మాదకద్రవ్యాల ప్రభావం అనే అంశం మీద ప్రదర్శించిన డ్రామా పోటీల లో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించి సూర్యాపేట జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన సందర్భంగా మండల విద్యాధికారి శ్రీ ఎండి సలీం షరీఫ్, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు కె రామకృష్ణ డ్రామా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను, గైడ్ టీచర్లు అశోక్ గౌడ్, ఎల్ దేవరాజ్ లను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



