విద్యార్థులు సమాజంలో ఉన్నత పౌరులుగా ఎదగాలి
:విద్యార్థులు ఉన్నత లక్ష్యాల వైపే వారి ప్రయాణం సాగించాలి
:సామాజిక అవగాహన కార్యక్రమంలో డిఎస్పి ఎం శ్రీధర్ రెడ్డి
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 24(ప్రతినిధి మాతంగి సురేష్):మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామంలో గల మహాత్మ జ్యోతిబాపూలే బిసి రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలలో విద్యార్థులకు సామాజిక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక డిఎస్పి ఎం శ్రీధర్ రెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో ఉన్నత పౌరులుగా ఎదిగి వారి తల్లిదండ్రులకు చదువు నేర్పిన గురువులకు గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు.సమాజంలో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాల గురించి విద్యార్థులకు వివరించారు.విద్యార్థులు భవిష్యత్తులో వారి ఎంచుకున్న లక్ష్యాలను సేదించే వరకు నిరంతరం పోరాడుతూనే ఉండాలని గుర్తు చేశారు.
సమాజంలో మంచి గౌరవం పేరు ప్రతిష్టలు రావాలంటే చదువు ఒకటే మార్గమని అన్నారు.చదువు ఎవరి సొత్తు కాదు దాన్ని ఎవరు దొంగలించలేరని తెలిపారు.అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలో క్రమశిక్షణతో చక్కటి భవిష్యత్తును అలవర్చుకొని ఉన్నత లక్ష్యాలను చేదించాలని అన్నారు.కేజిఎఫ్ గేమ్స్ డిస్టిక్ లెవెల్ కు సెలెక్ట్ అయిన వై నరేందర్ గోవర్ధన్ లను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏటీపీ గోపాలకృష్ణ,డిడబ్ల్యూ నరేష్,అధ్యాప,అధ్యాపకేతర సిబ్బంది అప్పారావు,అనిల్,నవీన్,సుధాకర్ రెడ్డి,సురేష్,లోకేష్,వీరయ్య,మధు బ్రహ్మచారి,అరుణ్,నజీర్,సైదా,రజిని,రాధిక,శ్రీను,జ్యోతి,మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
Pls subscribe MBM TELUGU NEWS my youtube chanal tq