విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
Mbmtelugunews//హుజూర్ నగర్, సెప్టెంబర్ 06:స్థానిక ప్రభుత్వ పాఠశాలలో శనివారం సుపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి జయవాణి దేవి పమర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 70 మంది విద్యార్థిని విద్యార్థులు కలెక్టర్,విద్యాశాఖ,మంత్రిగా,శాసనసభ్యులుగా,ఎమ్మార్వో,ఎంఈఓ,ప్రధానోపాధ్యాయులుగా వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులుగా,వ్యాయామ ఉపాధ్యాయులుగా వ్యవహరించారు.వీరికి ప్రధమ ద్వితీయ తృతీయ ప్రోత్సాహక బహుమతులు సాధించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్,వెంకటేశ్వర్లు,శ్రీదేవి,ప్రసాద్ మాతంగి ప్రభాకర్ రావు,అస్మామ్ బీన్,శేషగిరి,అన్వేష్,శైలజ,అరుణారాణి,వసంతరావు,జనార్దన్ రెడ్డి,శేఖర్,అశోక్,మున్ని బేగం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.