విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర.
:40 సంవత్సరాలు వృత్తి పట్ల అంకితభావంతో పనిచేశాను.
:పదవీ విరమణ సభలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి జయవాణి.
Mbmtelugunews//హుజూర్‌నగర్,జనవరి 31(ప్రతినిధి మాతంగి సురేష్):ఉపాధ్యాయ వృత్తి సవాళ్లతో కూడుకున్నదని,విభిన్న మనస్తత్వాలు గల విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి,వారిని సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని,గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి జయవాణి భావోద్వేగంతో తెలిపారు.శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు జయవాణి పదవీ విరమణ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఆత్మీయ పదవీ విరమణ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులను చదువుల పట్ల మక్కువ పెంచి,వారి కెరీర్‌పై శ్రద్ధ చూపేలా ప్రోత్సహించానని తెలిపారు.తమ జ్ఞానాన్ని,నైపుణ్యాలను యువ తరానికి అందజేసేది ఉపాధ్యాయులు మాత్రమేనని అన్నారు.విద్యార్థులలో అంతర్గతంగా దాగి ఉన్న,సహజ సామర్థ్యాలను వెలికి తీసి,వారికి అభిరుచి ఉన్న రంగంలో రాణించేలా ఎంతో మంది విద్యార్థులను ప్రోత్సహించానని తెలిపారు.విద్యార్థులకు నైతికత క్రమశిక్షణతో కూడిన
విలువలను అందించడానికి తన వంతు కృషి చేశానని అన్నారు.ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన నాటి నుండి,రిటైర్మెంట్ అయ్యేంతవరకు తాను బోధించిన పాఠశాలల్లో తనకు సహకరించిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

*ఉపాధ్యాయుల ఘన సన్మానం*
పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయురాలు జయవాణి వెంకటేశ్వర్లు దంపతులను పాఠశాల ఉపాధ్యాయ బృందం పూల మాలలు,శాలువాలతో ఘనంగా సత్కరించారు.వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ దేవదానం,ప్రధానోపాధ్యాయులు పెనుగొండ శ్రీనివాస్,బీరెల్లి శ్రీనివాస్ రెడ్డి,జయప్రద,ఉపాధ్యాయులు తాతరాజు శ్రీనివాస్,శ్రీదేవి,కొండా వెంకటేశ్వర్లు,మాతంగి ప్రభాకర్ రావు,ప్రసాద్,శేషగిరి,జనార్దన్ రెడ్డి,
అన్వేష్,జగదీశ్వర్ రెడ్డి,శేఖర్,విజయలక్ష్మి,అరుణ,సుజాత,శైలజ,మున్ని,నాగేశ్వరరావు
పాల్గొన్నారు.