విద్యుత్ మోటార్లు దొంగతనం
చిలుకూరు,జూన్ 01(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని బేతవోలు, సీతరాంతండ గ్రామాలకు చెందిన 12 మంది రైతుల విద్యుత్ మోటార్లు దొంగతనంకు గురైనాయి.ఈ విషయంపై బాధిత రైతులు శనివారం పోలీసే స్టేషన్ లో పిర్యాధు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.బేతవోలు గ్రామ శివారులో సీతరాంతండ దగ్గర గల రైతులు పోలాల్లో గల ‘విద్యుత్ మోటార్లును గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో విద్యుత్ మోటార్ ల కాపర్ వైర్లును దొంగతనం చేసినట్లుగా తెలిపారు.రోజు వారిగా ఉదయం పోలాలకు వెళ్ళే సరికే మోటార్లు దొంగతనంకు గురైనాయని తెలిపారు.రణబోతు అమర్నాధ్ రెడ్డి,పిట్ట వీరస్వామి,దేశబోయిన దుర్గష్,దేశబోయిన శ్రీను,గుగులోతు కోటియ్యా,బాణోతు పాప,బాణోతు వెంకటేశ్వర్లు,కేశగాని వీరయ్య,బెల్లంకొండ శంకర్,బెల్లంకొండ అంజయ్య ల విద్యుత్ మోటార్లు దొంగతనంకు గురైనాయి.



