విద్యుత్ శాకుకు గురై వ్యక్తి మృతి
Mbmtelugunews//కోదాడ/చిలుకూరు,నవంబర్ 06(ప్రతినిధి మాతంగి సురేష్):విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చిలుకూరు మండలంలోని కొండాపురం గ్రామంలో జరిగింది.మృతుడు బంధువులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంకు చెందిన యరమళ్ల నాగరాజు(41) కూలీ పనులు చేసుకుంటు అప్పుడప్పుడు పండుగలకు,శుభకార్యాలకు మైక్ సెట్లు పెడుతూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో మంగళవారం గ్రామంలో జరిగిన నాగుల చవితి పండుగకు గ్రామంలోని నాగదేవత దేవాలయంకు మైక్ సెట్లు,లైటింగ్లు ఏర్పాటు చేశారు.మంగళవారం వాటిని తీసేందకు తనతో పాటు తన కొడుకును తీసుకొని వెళ్ళినాడు.వాటిని తీసే క్రమంలో ఇనుప నిచ్చెనతో దేవాలయంపైకి ఎక్కే క్రమంలో ప్రక్కనే ఉన్న 11 కేవీ వైర్లు నిచ్చెనకు తగిలి విద్యుత్ షాక్ కు గురైనాడు.వెంటనే తన కొడుకు గట్టిగా అరవడంతో అక్కడ ఉన్న వారు వచ్చి వెంటనే కోదాడ వైద్యశాలకు తీసుకెళ్ళారు. ఈలోగనే నాగరాజు మృతి చెందినట్లుగా డాక్టర్లు ధృవీకరించినట్లుగా తెలిసారు. మృతుడు బార్య సరిత ఇచ్చిన ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ రాంబాబు తెలిపారు. మృతదేహాంను శవపరీక్ష అనంతరం వారి బంధువకు అప్పగించినట్లుగాఎస్సై తెలిపారు.మృతుడికి భార్య ఒక కుమారుడు,ఒక కుమార్తె ఉన్నారు.పండగు తెల్లారే దేవాలయం వద్ద ఇలాంటి ఘటన జరగడంతో గ్రామంతో విషాదఛాయలు అలుముకున్నాయి.