విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
Mbmtelugunews//సూర్యాపేట (పెన్ పహాడ్), నవంబర్ 02 (ప్రతినిధి మాతంగి సురేష్): ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ధూపహాడ్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది ఏఎస్ఐ రాములు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి… గ్రామానికి చెందిన బిట్టు వీర భద్రయ్య చిన్నకుమారుడు బిట్టు అభివర్మ (24) గత కొంత కాలంగా ఎలక్ట్రి షియన్ గా పనులు నిర్వహిస్తున్నాడు ఉదయకాల సమయంలో గ్రామ శివారులో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ లో ప్యూజ్ వైరు తెగి పోవడంతో ప్యూజ్ వేయడం కోసం ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి ప్యూజ్ వైర్ సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు అభివర్మకు విద్యుత్ షాక్ తగిలి అక్కడే పడిపోవడంతో గమనించిన స్థానికులు హుటా హుటిన సూర్యాపేట ఆసుపత్రికి తరలించగా అప్పటికే అభివర్మ మృతి చెందినట్లు డాక్టర్లు తెలపడంతో మృత దేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబానికి అప్పగించినట్లు తెలిపారు. మృతుని తండ్రి బిట్టు వీర భద్రయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు….



