విద్య వైద్యం న్యాయం చాలా కాస్ట్లీ అయినవి:మాజీ రాజ్య సభ సభ్యులు యలమంచిలి శివాజీ…
కోదాడ,మే 16(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:విద్య,వైద్యం న్యాయం కూడా ప్రస్తుతం చాలా కాస్ట్ లి అయినవి అని మాజీ రాజ్యసభ సభ్యులు ఎలమంచిలి శివాజీ అన్నారు.గురువారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ డిసిసిబి చైర్మన్ పాండురంగారావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రభుత్వాలు విద్య వైద్యం న్యాయం పేదలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలి అన్నారు.మోడీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాడని ప్రజలు అనుకుంటున్నారు కానీ ఏమీ మార్చలేడని అన్నారు.ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్న ప్రశ్నకు ప్రస్తుతం ఏమి చెప్పలేమని దాటా వేశారు.20 సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు.ప్రభుత్వాలు ఉచితాలు తగ్గించాలని,పేద ప్రజలకు విద్యా వైద్యం న్యాయం అందేలా చూడాలి అని అవి అందించే ప్రభుత్వాలకు మనుగడ ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కాకతీయ కమ్మ సంఘం అధ్యక్షులు పెదనాటి వెంకటేశ్వరరావు,అడ్వకేట్ మేకల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.



