విధి నిర్వహణలో మరణించిన శీలం కమలాకర్ కుటుంబానికి 2009 బ్యాచ్ పోలీస్ మిత్రుల అండ.
:శీలం కమలాకర్ కుటుంబానికి అండగా ఉంటాం
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 23(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని గుడిబండ గ్రామానికి చెందిన 2009 బ్యాచ్ పీసీ శీలం కమలాకర్ విధి నిర్వహణలో మరణించిన విషయం అందరికి తెలిసిందే. తమతో కలిసి సేవలందించిన స్నేహితుడి కుటుంబానికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో 2009 బ్యాచ్ పోలీస్ మిత్రులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి మొత్తం రూ. 2,67,000/- (రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయలు)ను బుధవారం రిటైర్డ్ ఎస్సై పులి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా కమలాకర్ నివాసంలో ఆయన కుటుంబానికి ఆర్థిక భరోసాగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కమలాకర్ సేవలు ఎప్పటికీ మరిచిపోలేమని, ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సహాయం కమలాకర్ కుటుంబానికి కొంతైనా ధైర్యాన్ని ఇచ్చిందని స్థానికులు తెలిపారు.స్నేహం, సేవాభావం అంటే ఏమిటో చాటిచెప్పిన 2009 బ్యాచ్‌మేట్స్ సహకారాన్ని గ్రామస్తులు, సహకారాన్నిసహచరులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ జై శ్రీకాంత్, టి నరేష్, కే సైదులు, శేషు దుర్గాప్రసాద్, జోసఫ్ మధుకర్, రవి ,షేక్ జానిమియా తదితరులు పాల్గొన్నారు



