కోదాడ,డిసెంబర్ 20(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నేడు అనగా ఇది 21.12.2023 న కోదాడ పట్టణంలో గల 33/11 సబ్ స్టేషన్ నందు కోదాడ రూరల్ సెక్షన్ ఆఫీస్ నందు కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కోదాడ రూరల్ ఏఈ ఆర్ శ్రీనివాసరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో కరెంట్ ని వినియోగించుకుంటున్న వినియోగదారులు,రైతులు వారి యొక్క సమస్యలను నేరుగా రూరల్ సెక్షన్ ఆఫీసులో నేడు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వీకరించబడతాయి.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమానికి సూర్యాపేట సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీరు, హుజూర్ నగర్ డిఈ లు వస్తున్నారు.
వినియోగదారుల కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ని సద్వినియోగం చేసుకోవాలి:ఎలక్ట్రికల్ ఏఈ ఆర్ శ్రీనివాసరావు
RELATED ARTICLES



