వినేశ్ పొగాట్ అనర్హతపై సవాల్..
Mbmtelugunews//పారిస్,ఆగష్టు 10 ప్రతినిధి మాతంగి సురేష్:పారిస్ ఒలింపిక్ గేమ్స్ లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురైన విషయం తెలిసిందే.50 కేజీల విభాగంలో 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఫొగాట్పై అనర్హత వేటు పడింది.ఈ నేపథ్యంలో తనపై అనర్హతను వినేశ్ పొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ సవాల్ చేసింది.వినేశ్ అభ్యర్థనను కాస్ తాజాగా విచారణకు స్వీకరించింది.ఒలింపిక్ గేమ్స్ ముగిసేలోగా నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టం చేసింది.ఈ మేరకు కాస్ అధికారిక ప్రకటన చేసింది.కాగా,అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన వినేశ్ పొగాట్ తనకు రజత పతకం ఇవ్వాలని అప్పీలులో కోరింది.అయితే,ఒలింపిక్స్ లో నిబంధనలను మార్చే అవకాశం లేదని యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్ స్పష్టం చేసింది.ఒకవేళ ఆర్బిట్రేషన్ అనుమతి ఇస్తే వినేశ్ కు సిల్వర్ మెడల్ దక్కే ఛాన్స్ ఉంది.దీంతో కాస్ ఏ తీర్పు ఇస్తుందా అని భారత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరోవైపు అనర్హత నేపథ్యంలో రెజ్లింగ్ కు వినేశ్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.