కోదాడ,ఏప్రిల్ 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక లాల్ బంగ్లాలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినం, లెనిన్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ జెండాను సీనియర్ నాయకులు అలుగుబెల్లి సత్యనారాయణ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి పాల్గొని మాట్లాడుతూ రివిజనిజానికి,నయా రివిజనిజానికి వ్యతిరేకంగా నక్సల్బరీ వెలుగులో విప్లవకారుల నాయకత్వంలో మార్క్సిస్టు మహోపాధ్యాయుడు లెనిన్ పుట్టినరోజు సందర్భంగా సిపిఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భావం జరిగిందని అన్నారు.నేటికీ 55 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అనేక త్యాగాలతో రాజ్యానిర్బంధాలను ఎదుర్కొంటూ ఒడిదుడుకులను తట్టుకొని విప్లవోద్యమాలు ముందుకు సాగుతున్నాయని అన్నారు.దేశంలో పార్లమెంటు ఎన్నికల వేడి రాజుకుందని ప్రస్తుతం పాలిస్తున్న మోడీ విధానాలు దేశంలో ప్రమాదకరంగా పరిణమించాయని ప్రజాస్వామిక విధానాలపై ప్రశ్నించే శక్తులపై అంచివేత కొనసాగుతున్నదని అన్నారు.రైతాంగం కార్మికులు అన్ని వర్గాల ప్రజలను సమస్యల్లోకి నెట్టి సంపన్న వర్గాలకు కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అప్పజెప్తున్న పరిస్థితి కొనసాగుతుందన్నారు.ప్రజలు పాసిస్తూ శక్తులకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ శక్తులను గెలిపించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి వి నరసింహారావు,విజయ్,మైసయ్యవీరబాబు,సైదులు,సురేష్,నాయక్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు



