వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ పాలకి సురేష్
Mbmtelugunews//కోదాడ, మర్చి 06(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని దోరకుంట గ్రామంలో నూతనంగా శాంక్షన్ అయినా స్త్రీశక్తి భవనానికి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ పాలకి సురేష్ పాల్గొని భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం నెమలిపురి కాలనీ రోడ్ కు సిసి రోడ్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాలకి సురేష్ మాట్లాడుతూ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో దోరకుంట గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ పత్తిపాక రమాదేవి, మహిళా సంఘాల అధ్యక్షులు నీలవేణి, ఫాతిమా, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్స్ కస్పరాజు ఉపేంద్ర, షేక్ హమీనా, దాసరి ఉమా, పత్తిపాక రాము, శీలం నాగమణి, వనపర్తి పిచ్చయ్య, కన్నె రామకృష్ణ, పాలడుగు జాన్, కొనపర్తి తిరుమల చారి, కాంగ్రెస్ నాయకులు గద్దల వెంకటేశ్వర్లు, అధ్యక్షులు పత్తిపాక వెంకటేశ్వర్లు, ఒగ్గు నాగేంద్రబాబు, సుంకర మల్లేష్,ఈమని పిచ్చిరెడ్డి, పత్తిపాక రామ్మూర్తి, పత్తిపాక రమేష్, వీరస్వామి, శీలం బజార్, దాసరి వీరబాబు, నోముల బాలకృష్ణ, గ్రామంలోని పెద్దలు , సంభావన సంఘ లీడర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.



