విశ్వజనని సేవా రత్న అవార్డు అందుకున్న జర్నలిస్ట్ తంగెళ్ళపల్లి లక్ష్మణ్
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 01(ప్రతినిధి మాతంగి సురేష్): హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని విశ్వజనని ఫౌండేషన్ మూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నలు మూలల నుండి వివిధ రంగాలలో స్వచ్ఛంద సేవలు అందించే వారిని గుర్తించి, విశ్వజనని ఫౌండేషన్ ఫౌండర్,చైర్మన్ బొగ్గారపు బ్రహ్మానందం అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా… కోదాడకు చెందిన సీనియర్ జర్నలిస్టు,సమాచార హక్కు సాధన సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు తంగెళ్ళపల్లి లక్ష్మణ్ విశ్వజనని సేవారత్న అవార్డును తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ భూపాల్ చేతుల మీదుగా అందుకున్నారు.అవార్డు అందుకున్న అనంతరం లక్ష్మణ్… మాట్లాడుతూ, సమాజంలో సేవలు చేసే వారిని గుర్తించి, అవార్డు రూపంలో ప్రోత్సహించడం వారి సేవలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రోత్సహకంగా ఉంటుందని, ఈ గుర్తింపు తమపై మరింత బాధ్యతను పెంచుతుందని అన్నారు. బొగ్గారపు బ్రహ్మానందం కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు సందర్భంగా లక్ష్మణ్ కు పలువురు నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు అభినందనలు తెలిపారు.



