విషాదంగా ముగిసిన చిన్నారి అదృశ్యం
Mbmtelugunews//మహారాష్ట్ర, సెప్టెంబర్ 17:కుబీర్ మండలం అంతర్నీ గ్రామంలో గత ఐదు రోజుల కిందట రాథోడ్ వర్ష అనే ఐదేళ్ల చిన్నారి అదృశ్యం విషాదంగా ముగిసింది .కుబీర్ ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర కు చెందిన రాథోడ్ రమేష్ గ్రామంలోని ఓ రైతు వద్ద పాలేరుగా పనిచేస్తున్నారు అతని కూతురు వర్ష వినాయక మండపానికి వెళ్లి తిరిగి రాలేదు ఎంత వెతికిన ఆచూకీ తెలియక పోవడం తో కుబీర్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.స్థానికులు చిన్నారి గ్రామంలో ఓ చెత్త కుప్ప వద్ద మృతి చెంది పడి ఉన్నట్లు గుర్తించి నట్లు తెలిపాడు.దీంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.చిన్నారి మృతి పట్ల పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.